News

ఆర్థిక శాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం

292views

2023 ఏడాదికి గాను ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్‌ ఫలితాలపై విశేష కృషి చేసినందుకుగాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతిని కేటాయించింది.

క్లాడియా గోల్డిన్‌ అమెరికాకు చెందిన ప్రముఖ లేబర్ ఎకనమిస్ట్‌. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మహిళా శ్రామిక శక్తి, సంపాదనలో లింగ వ్యత్యాసం, ఆదాయ అసమానత, సాంకేతిక మార్పు, విద్య, వలసలతో సహా అనేక రకాల అంశాలపై ఆమె పరిశోధన చేశారు. 1990ల్లోనే హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ క్లాడియా గోల్డిన్‌. మహిళా ఆర్థిక శక్తిపై ఆమె ఎనలేని పరిశోధన చేశారని స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.