News

యూరోప్ లో పలు నగరాల్లో కన్నుల పండుగలా శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు

385views

తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో యూరప్ లోని అక్టోబర్ 07న ప్యారిస్ (ఫ్రాన్స్), 08న డబ్లిన్ (ఐర్లాండ్) నగరాల్లో శ్రీ శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభావంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.

యూరప్ లోని ఆయా నగరాలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం నిర్వహించాలని పలు తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల నుండి ఏపీఎన్ఆర్టీ సొసైటీకి వచ్చిన అభ్యర్థనల మేరకు తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేదపండితులు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణోత్సవం నిర్వహించారు. అక్కడి నిర్వాహకులు… తితిదే బృందానికి, భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈ రెండు నగరాల్లో జరిగిన ఈ కల్యాణోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి తెలుగు వారే కాక, తమిళనాడు, కేరళ, కర్నాటక ఇలా ఇతర రాష్ట్రాలకు చెందిన అశేష సంఖ్యలో స్వామివారి NRI భక్తులు హాజరై కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆయా ప్రాంగణాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. హాజరైన భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొన్న అనంతరం భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించటం జరిగింది.