News

సాయిబాబా రథోత్సవం

167views

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని పులకుర్తిలో సాయిబాబా ఉత్సవంలో భాగంగా రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో అభిషేకాలు, పుష్పార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం సాయినాథుని ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాల మధ్య తీసుకుని వచ్చి రథంపై కొలువుంచారు. అనంతరం భక్తులు రథాన్ని లాగారు. రథాన్ని నందిమండపం వరకు లాగి తిరిగి ఆలయం చేర్చారు. ఈ వేడుకను తిలకించడానికి గ్రామప్రజలే కాకుండా పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించి ధునిలో టెంకాయలు సమర్పించారు. అంతకుముందు ఉదయం ఎమ్యెల్యే సుధాకర్‌, కుడా చైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి వేర్వేరుగా అనుచరులతో విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌ఐ శ్రీనివాసులు అధ్వర్యంలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.