News

ఛత్తీస్‌గఢ్ లో రెచ్చిపోయిన నక్సలైట్లు

224views

ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా అరణ్‌పూర్‌లో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. మందుపాతర పేల్చి 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్‌ను పొట్టనపెట్టుకున్నారు. మృతులంతా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు. డీఆర్‌జీ జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వస్తుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చారు. దీంతో మొత్తం 11 మంది చనిపోయారు. ఘటనా స్థలనికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. నక్సలైట్ల కోసం కూంబింగ్ మొదలుపెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్‌తో మాట్లాడారు. అన్నివిధాలా సాయమందిస్తామని హామీ ఇచ్చారు.