News

చెన్నైలో విజృంభిస్తున్న వింత రోగం

383views

చెన్నైలో గత వారం రోజులుగా ‘మద్రాస్‌ ఐ విజృంభిస్తోంది. ప్రస్తుతం ఎండవేడిమి అధికంగా ఉండటం వల్ల కళ్లలో తడి బాగా తగ్గిపోయి ఇలాంటి వ్యాధులు వస్తాయని కంటివైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవి సీజన్‌లో నగరవాసులకు మద్రాస్‌ – ఐ వ్యాపించడం ఆనవాయితీ. ఈ మేరకు మే, జూన్‌(May, June) నెలల్లో ఆ కంటి జబ్బు వ్యాపించే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం ఎండవేడిమి అధికంగా ఉండటంతో ఇప్పుడు ఆయా వ్యాధులు వస్తున్నాయని వారు చెబుతున్నారు. వేసవిలో కళ్ళు ఎర్రగా మారడం సహజమే అయినా, ఇటీవల గాలిలో ధూళిశాతం అధికమైనందున కళ్లలో మంటలు రేగుతున్నాయి. ఆ సమయంలో నీటితో శుభ్రం చేసుకోకుండా చేతులతో కళ్ళను నలపటంతో కళ్లు ఎర్రబడతాయి. ఈ వేసవిలో కళ్లలో తడి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, తరచూ శుభ్రమైన మంచినీటితో కళ్ళను కడగాలని, వీలైతే తగిన చుక్కల మందులను వాడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వేసవిలో నగరవాసులు చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, అదే సమయంలో కళ్ళను చేతులతో తాకకుండా ఉండాలని చెబుతున్నారు.