News

కొనసాగుతున్న సంబరాలు

203views

ఇచ్ఛాపురం: కోయడ్యాన్స్‌లు, తప్పెటగుళ్లు, కాళీమాత వేషధారణలు, మేళతాళాలు నడుమ స్వేచ్ఛావతి అమ్మవారి తిరువీధి మహోత్సవం గురువారం వేడుకగా నిర్వహించారు. అమ్మవారి సంబరాల్లో భాగంగా గురువారం పలు వీధుల్లో తిరువీధి గావించారు. ఈ సందర్భంగా పులి వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అధికసంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని ఎమ్మెల్సీ నర్తు రామారావు దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా సంబరాల మహోత్సవాల పో స్టర్లను కమిటీ సభ్యులు గురు వారం ఆవిష్క రించారు. మే 1 నుంచి 15 వరకు జరగనున్న సాం స్కృతిక కార్యక్రమాలు ప్రకటించారు.