
250views
కడప జిల్లా పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం వైద్యనాఽథేశ్వర ఆలయంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, కామాక్షమ్మ అమ్మవారికి ఖడ్గమాలతో కుంకుమార్చన చేశారు. నిత్య హోమాలు, బలి హరణం అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలందజేశారు. సాయంత్రం సింహ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. కొండపై లక్ష్మి చెన్నకేశవస్వామికి సుప్రభాత సేవ, అభిషేకం, తోమాలసేవ చేశారు. సాయంత్రం వేళలో చెన్నకేశవస్వామిని గజవాహనంపై ఊరేగించారు. భక్తులు దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే నేడు వైద్యనాథేశ్వరుడు పురుషామృగవాహనం, చెన్నకేశవుడు పెద్దశేష వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారని పండితులు తెలిపారు.





