News

అంకురార్పణతో ప్రారంభమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

241views

కడప జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుష్పగిరిలో కామాక్షి వైద్యనాధేశ్వర లక్ష్మి చెన్నకేశవస్వామివార్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వైద్యనాధేశ్వరాలయంలో సాయంత్రం గణపతిపూజ, పుణ్యహ వచనం నిర్వహించి.. కలశారాధనను గావించారు. అనంతరం వాస్తు శాంతి, వాస్తు హో మం నిర్వహించి.. అనంతరం అంకుర్పాణ కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. అలాగే కొండపై ఉన్న చెన్నకేశవస్వామి సన్నిధిలో సాయం సంధ్యలో విశ్వక్సేన ఆరాధనతో ఆరంభించి పుణ్యహవచనం నిర్వహించారు. శుద్ధి చేసిన జలాలతో ఆలయంలో సంప్రోక్షణ చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మేధిని పూజ నిర్వహించామని ఆలయ అర్చకులు అఖిల్‌దీక్షితులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బుధవారం వైద్యనాధేశ్వర, చెన్నకేశవస్వామి తిరుచ్చి వాహనంలో భక్తులకు దర్శనమిస్తారని.. అలాగే ధ్వజారోహణ కార్యక్రమంఉంటుందని అర్చకులు తెలిపారు.