News

గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. ‘పదవి నుంచి తప్పుకుంటా’నంటూ.

232views

ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి సంబంధించిన విధులను సంతోషంగా నిర్వర్తించాలని, తన వరకు తన విధులు సంతృప్తికరంగా, సంతోషంగా లేదని అనిపించిన మరుక్షణమే తప్పుకుంటానని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(State Governor RN Ravi) అన్నారు. రామనాఽథపురం మరకారాయర్‌పట్టిలోని కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులతో భేటి అయ్యారు. ఆ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు గవర్నర్‌ సమాధానం చెబుతూ… మీ జీవనయానంలో ఏ పరిస్థితిలో ఉన్నా మీ విధులను సంతోషంగా, సంతృప్తికరంగా నిర్వర్తించాలి. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్‌గా తాను నిర్వర్తిస్తున్న విధులు సంతోషంగానే చేస్తున్నానని, ఈ విధులు సంతృప్తి కలిగించని మరుక్షణమే పదవి నుండి తప్పుకుంటానని, తనను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు