
238views
విజయనగరం జిల్లా మామిడిపల్లి గ్రామ దేవత ముంగారమ్మ పండగకు ఆదివారం శ్రీకారం చుట్టారు. దీనిలోభాగంగా తొలి అంకమైన గడుల పూజ ( పొలిమేర కట్టడి ) కార్యక్రమాన్ని ఆదివారం అశేష భక్తజనం నడుమ ఘనంగా నిర్వహించారు. పూజాసామగ్రి, ముర్రాటతో పెద్దసంఖ్యలో మహిళలు తిరువీధిగా తరలివచ్చారు. దక్షిణ దిక్కులో సువర్ణముఖీ నది వైపు ప్రాంతంలో తొలుత రాజులు గడుల పూజను చేశారు. అనంతరం గ్రామస్థులు గడుల పూజను చేశారు. నాలుగు దిక్కుల గ్రామ పొలిమేర గడులను కలుపుతూ జన్ని ముర్రాటలతో కట్టడి చేశారు. ఈ పూజ పూర్తి కావడంతో ఈ నెల 15న దేశమ్మకు మొక్కుబడులు చెల్లించనున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత మామిడిపల్లి గ్రామదేవత ముంగారమ్మ పండుగను వచ్చే నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్నారు.





