News

వైభవంగా చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

204views

మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్స వాలలో భాగంగా ఆదివారం రాత్రి చెన్నకేశవ స్వామి శేషవాహనంపై కాళియమర్ధన అలం కారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నగరోత్స వంలో భాగంగా నాలుగు మాఢవీధులలో విహరించారు. శేషవాహన విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు వివరించారు. ఉదయం జటప్రోలు సుబ్రహ్మణ్యం, రాత్రి గానుగపెంట కూర్మయ్య వంశస్థులు ఉభయ దాతలుగా వ్యవహరిం చారు. ఆలయ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ పి.కేశవరావు, ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. భక్తులు స్వామిని పూజించి కాయకర్పూరం సమర్పించారు.

నేడు వ్యాళి వాహనం

బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మిచెన్నకేశవుడు సోమవారం రాత్రి వ్యాళి వాహనంపై వామన అలంకారంలో నాలుగు తిరుమాఢవీధులలో విహరించనున్నారు.