News

భక్తులు పోటెత్తారు

222views

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రికి 70 వేల మంది భక్తులు తరలి రావ డంతో మంత్రాలయం రోడ్లు, మఠం ప్రాంగణం, మధ్వమార్గ్‌కారిడార్‌ భక్తులతో కిక్కిరిసింది. ఇసుక వేస్తే రాలనంతా భక్తులు రావడంతో క్యూలైన్లు, పరిమళ ప్రసాదం, అన్నదానానికి భక్తులతో నిండిపోయాయి. గదులు దొరకక మఠం మధ్వమార్గ్‌ కారిడార్‌లోనే భక్తులు నిద్రించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మఠం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.