News

ఘనంగా పోలేరమ్మ జాతర

595views

కడప జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్ల సమీపంలోని ఇప్పవనంలో వెలసిన పోలేరమ్మ గ్రామ దేవత తిరునాళ్ల వైభవంగా జరి గింది. అమ్మ వారికి వివిద పుష్పాలతో పాటు నిమ్మకాయలతో అకర్షిణీ యంగా అలకరించి డప్పుల దరువులు, మేళాతాళాలు మంగళవాయిద్యాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారికి దీయలు, బోనాలు భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించారు. పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా 10 రోజులు పాటు జరిగే మహాభారతం హరికథ కాలక్షేపం, నాటక కార్యక్ర మాలతో పాటు ఎద్దుల పరషను నిర్వాహకుడు కలిచెర్ల సింగిల్‌విండో చైర్మన కడప సుధహరరెడ్డి ప్రారంభిం చారు. ఆలయాన్ని విద్యుత్తుదీపాలతో అలంకరించారు. మండల ప్రజలు, సమీప జిల్లా గ్రామాల నుంచి తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కడప మధుకరరెడ్డి, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.