News

శ్రీనగర్‌లో జీ-20 సదస్సు

170views

చైనా, పాకిస్థాన్‌ల అభ్యంతరాలను తోసిరాజని.. జీ-20 సదస్సును కశ్మీర్‌లో నిర్వహించేందుకు భారత్‌ నిర్ణయించింది. ఈ ఏడాది మే 22 నుంచి 24 వరకూ టూరిజం వర్కింగ్‌ గ్రూపు సమావేశం శ్రీనగర్‌లో జరగనుందని తాజాగా స్పష్టం చేసింది. జీ-20 కాలెండర్‌ను అప్‌డేట్‌ చేసింది. ఈ ఏడాది జీ-20కి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. శ్రీనగర్‌లో సదస్సును విజయవంతంగా నిర్వహించడం ప్రస్తుతం భారత్‌ ముందున్న సవాలు అని అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వ్యూహాత్మకంగా ప్రపంచ రాజకీయాల దృష్ట్యా ఇది కీలకమని వారు అంచనా వేశారు. ‘‘కేవలం కశ్మీర్‌ అందాన్ని ప్రపంచానికి చూపడమే కాక, కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని ప్రపంచానికి స్పష్టంగా చాటిచెప్పడంలో ఈ సదస్సు భారత్‌కు అవసరం. 370వ ఆర్టికల్‌ రద్దు తర్వాత కశ్మీర్‌లో పరిస్థితి సాధారణ స్థితికి చేరిందని చాటి చెప్పేందుకూ ఈ సదస్సు ఉపకరిస్తుంది’’ అని వారు తెలిపారు.