
239views
దేశవ్యాప్తంగా మొత్తం ఎన్నికల ప్రక్రియలోనే మార్పు తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆదివారం చెప్పారు. ఇందుకోసం ఎన్నికల నిబంధనల్లో కొన్ని సవరణలు చేస్తామన్నారు. ‘‘అయితే, దీనిపై నేను ఇప్పుడే ఏ హామీ ఇవ్వలేను. అది ఇంకా చర్చల దశలోనే ఉంది’’ అని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని బుడ్గావ్‌లో న్యాయసేవా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.





