
165views
కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో పాక్ ఉగ్రవాదుల కుట్రను భద్రత బలగాలు తాజాగా భగ్నం చేశాయి. ఇక్కడి నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)ను దాటి దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరిని కాల్చిచంపాయి. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ‘‘ఆదివారం తెల్లవారుఝామున 2.15 గంటల ప్రాంతంలో ఎల్‌ఓసీ వద్ద కదలికను గుర్తించిన బలగాలు, కంచె వెంబడి జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. ఉగ్రవాదుల నుంచి డ్రగ్స్, పాకిస్ధాన్ నగదును స్వాధీనం చేసుకున్నాం’’ అని పేర్కొన్నాయి.





