News

వీసాల ఫీజులు పెంచిన అమెరికా

205views

టూరిస్టు, స్టూడెంట్‌, వర్క్‌ వీసాల ఫీజులను అమెరికా పెంచింది. మే 30 నుంచి పెంచిన ధరలు వర్తిసాయి. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా అప్లికేషన్‌ (ఎన్‌ఐవీ) ప్రాసెసింగ్‌ ఫీజును 165 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచినట్టు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. బిజినెస్‌ లేదా టూరిజం (బీ1/బీ2, బీసీసీ) విజిటర్‌ వీసాలకు, స్టూడెంట్‌, ఎక్స్చేంజ్‌ వీసాలు వంటి వాటికి ఈ ఫీజులు వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుత కరెన్సీ మారకం రేట్ల ప్రకారం ఈ కేటగిరీ ఫీజులను రూ.13,095 నుంచి రూ.15,140కు పెంచారు. ఇక తాత్కాలిక ఉద్యోగులకు జారీ చేసే హెచ్‌, ఎల్‌, ఓ, పీ, క్యూ, ఆర్‌ కేటగిరీల వీసాల ఫీజులను 190 డాలర్ల (రూ.15,550) నుంచి 205 డాలర్ల (రూ.16,777)కు పెంచింది. ఆయా కేటగిరీల వీసాల ఫీజులను చివరిసారిగా కొన్నింటిని 2012లో, మరికొన్నింటిని 2014లో సవరించారు.