News

శ్రీవారి నిజపాద దర్శనం వీలుకాదన్న ఈవో…. సుదర్శనం, గోవర్ధన్, కల్యాణి సత్రాల పునర్నిర్మాణం

177views

గత కొంతకాలం క్రితం వరకూ భక్తులకు భగవంతుడు గోవింద విగ్రహం యొక్క పవిత్ర పాదాలను చూసే అవకాశం ఉండేది.. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఓ ధర్మారెడ్డి నిర్వహించిన టీటీడీ డయల్ యువర్ కార్యక్రమంలో శ్రీవారి నిజపాద దర్శన పునః ప్రారంభించాలని భక్తులు కోరారు. అయితే శుక్రవారం శ్రీవారి ఆలయంలో సమయా భావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. నిజపాద దర్శనం వల్ల స్వామివారికి నైవేద్యం ఆలస్యం అవుతుందని తెలిపారు.

అంతేకాదు ఆలయంలో సుదర్శనం, గోవర్ధన్, కల్యాణి సత్రాలల్లో పారిశుధ్యం బాగాలేదని ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఈ మూడు సత్రాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. స్వామివారి అన్న ప్రసాద వితరణలో నాణ్యతని పెంచేందుకు ఇక పై టెండర్ల ద్వారా కాకుండా మిల్లర్ల ద్వారా బియ్యాని సేకరిస్తామని తెలిపారు.