News

వైభవంగా శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో

271views

కావలి కచ్చేరిమిట్టలో వెలసివున్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీవారికి అశ్వవాహనసేవ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ, ప్రధాన అర్చకులు బుర్రా శేషాచార్యులు పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యంలో పాల్గొని పూజలు చేశారు. ఉదయం వసంతోత్సవం, విశేష అభిషేకాలు, హోమపూజలు నిర్వహించారు. టంగుటూరి జయశ్రీ బృందంచే నిర్వహించిన అన్నమయ్య సంకీర్తన విభావరి భక్తులను ఆకట్టుకుంది. రాత్రి శ్రీవారు అశ్వవాహనంపై ఊరేగుతూ పురప్రజలకు దర్శనమిచ్చారు.