News

నేటితో ముగియనున్న శ్రీనివాసుడి తెప్పోత్సవాలు 

302views

వేద పండితుల వేద పారాయణలు, అన్నమాచార్య సంకీర్తనలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి తెప్పోత్సవం కనుల పండుగగా జరిగింది. ఇక చివరి రోజు అయిన నేడు మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సహితంగా పుష్కరిణిలో ఏడుసార్లు తెప్పపై విహరించి భక్తులను కటాక్షిస్తారని తెలుస్తుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

అతి ప్రాచీన కాలం నుండి స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు
ప్రతి సంవత్సరం ఐదు రోజులపాటు తిరుమల శ్రీవారి పుష్కరిణిలో జరిగే ఈ సాలకట్ల తెప్పోత్సవం అతి పురాతన కాలం నుంచి జరుగుతున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీలో భాగంగా ఈ ఏడాది కూడా ఘనంగా స్వామివారి సాల కట్ల తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. నేటితో సాలకట్ల తెప్పోత్సవాలు ముగియనున్న నేపథ్యంలో నేడు చివరి రోజు పుష్కరిణిలో విహరించే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎదురు చూస్తున్నారు.