News

హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫోన్లలో అధికశాతం బలవన్మరణం గురించే వస్తున్నాయి!

224views

మానసిక సమస్యల సహాయంకోసం తాము ఏర్పాటు చేసిన జాతీయ హెల్ప్‌లైన్‌ ఫోన్‌ నంబరుకు వచ్చే కాల్స్‌లో ఆందోళన, నైరాశ్యం, ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వారివే మూడోవంతున్నాయని ది సైరస్‌ అండ్‌ ప్రియ వంద్రేవాలా ఫౌండేషన్‌ తాజాగా వెల్లడించింది. వీటిలో ఫోన్లు తెలంగాణ నుంచి వస్తున్నాయని తెలిపింది. గత నవంబరు నుంచి ఈ ఏడాది జనవరి మధ్యలో ఆ సమస్యల కారణంగా సహాయాన్ని కోరిన వారు 40 శాతానికిపైగా ఉన్నట్టుపేర్కొంది. 2021 ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి మధ్యలో 61,258 మందితో జరిగిన 114,396 సంభాషణలు, 17 లక్షల సందేశాలను అధ్యయనం చేసినట్లు తెలిపింది. ‘‘ఫోన్‌ చేసినవారిలో మూడోవంతుమంది మానసిక అనారోగ్యంతో, బలవన్మరణ ఆలోచనలతో బాధపడుతున్నామని చెప్పారు. గత ఏడాది హత్యలు, కరోనా వైరస్‌ కంటే ఆత్మహత్యలతో ఎక్కువమంది కన్నుమూశారు. నేడు దేశంలోని ప్రతి వైద్య విద్యార్థీ మానసిక వైద్యుడిగా మారినా భారత్‌కు మానసిక నిపుణులు సరిపోరు’’అని సంస్థ పేర్కొంది.