
శారదాపీఠం ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదని శారదపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీ అధికారంలోకి రావాలని యజ్ఞ యాగాదులు చేయమన్నారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలన్నదే తమ కోరిక అని, ప్రజల క్షేమం కోసం తమ పీఠం పాటుపడుతుందని తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశానికి విశేష ఆదరణ ఉంటుందన్నారు. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమం హర్యానాలోని కురుక్షేత్రలో శ్రీ లక్ష చండి మహా యజ్ఞం విజయవంతమైందని అన్నారు. భక్తులు పెద్ద ఎత్తున్న హాజరయ్యారని తెలిపారు. చరిత్రలోనే తొలిసారిగా భారీ ఎత్తున లక్షకు పైగా చండీ పారాయణ హోమాలను ఈ యజ్ఞం ద్వారా నిర్వహించినట్లు చెప్పారు. లక్ష చండీ యజ్ఞం బృహత్తరంగా జరిగిందన్నారు. భారతదేశం మొత్తానికి మంచి జరగాలని యజ్ఞం చేశామని స్వామీజీ తెలిపారు.
ప్రపంచంలోనే భారతదేశానికి విశేష ఆదరణ ఉంటుందన్నారు. యువత ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతతో ఉండాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో శారద పీఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఢిల్లీలో కూడా శారదాపీఠం ఏర్పాటుకు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. శారదాపీఠంపై కొందరు రాజకీయ ముద్ర వేయాలని చూశారని… అయితే శారదాపీఠం ధర్మం వైపు నడుస్తుందని స్పష్టం చేశారు. భారతదేశంలో హిందూ ధర్మాన్ని వేగంగా వ్యాప్తి చేయాలనేదే తమ లక్ష్యమన్నారు. ఎక్కడైతే యజ్ఞాలు జరుగుతాయో అక్కడ అంతా బాగుంటుందన్నారు. భారతదేశ చరిత్ర ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుందని… యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని అన్నారు. సమాజానికి మంచి జరగాలని ఎప్పుడు శారద పీఠం కోరుకుంటుందని శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు తెలియజేశారు.





