News

దుర్గమ్మ కానుకలు రూ. 2.11 కోట్లు

199views

విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన హుండీలలోని కానుకల లెక్కింపులో అమ్మవారికి రూ. 2,11,36,722 నగదు రూపేణా సమకూరింది. 14 రోజులకు గాను హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలు రోజుకు సగటున రూ. 15.09 లక్షలు వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు. 558 గ్రాముల బంగారం, 4.605 గ్రాముల వెండి, ఆన్‌లైన్‌ ద్వారా రూ.22,989 సమకూరాయి. కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో భ్రమరాంబ, ట్రస్ట్‌బోర్డు చైౖర్మన్‌ కర్నాటి రాంబాబు, తదితరులు పర్యవేక్షించారు.