News

చైనాలో భారీ భూకంపం

199views

చైనాలోని జింజియాంగ్ వీఘర్ అటానమస్ రీజియన్‌లో గురువారం తీవ్ర భూకంపంతో కకావికలమైంది. చైనా స్టేట్ మీడియా కథనం ప్రకారం గురువారం 7.3 తీవ్రతతో భూమి కంపించింది. అయితే అమెరికన్ జియొలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.8 అని తెలుస్తోంది. ఇది తజకిస్ఠాన్ సరిహద్దుల్లోని ముర్ఘబ్‌కు పశ్చిమ దిశలో 67 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. భూమి లోపల 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. పామిర్ కొండ ప్రాంతంలో సుమారు కొన్ని వందల మంది నివసించే ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.

చైనా ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్స్ సెంటర్ కథనం ప్రకారం తజకిస్థాన్‌ ను గురువారం భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. దీని కేంద్రం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇదిలావుండగా, ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం జరిగిందా? లేదా? అనే సమాచారం తెలియరాలేదు.