News

మాదకద్రవ్యాల గుట్టురట్టు.. ఉగ్ర సంస్థ నిధులతో విజయవాడలో కార్యకలాపాలు!

241views

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం చిరునామాతో రిజిస్టరైన ఆష్లీ ట్రేడింగ్ కంపెనీ పేరిట దేశంలోకి దిగుమతి అవుతూ గుజరాత్లోని ముంద్రా పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడ్డ వ్యవహారంలో ఉగ్రమూలాలు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ మాదకద్రవ్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ‘లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు సమకూరుస్తున్నట్లు గుర్తించింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు ఆ సంస్థ ఈ నిధుల్ని వెచ్చిస్తున్నట్లు ఎస్ఎస్ఐఏ సోమవారం అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్వారంపూడి వాసి మాచవరం సుధాకర్‌ను నిందితుడిగా చేర్చింది. ఆయన నడుపుతున్న కంపెనీ ఆషి ట్రేడింగ్ అని తెలిపింది.

అప్పట్లోనే విజయవాడలో సోదాలు..
ఆఫ్గానిస్థాన్ నుంచి ఇధాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు మీదుగా సెమీ ప్రాసెస్డ్ టాల్కమ్ ముసుగులో తరలిస్తున్న 3 వేల కిలోల హెరాయిన్‌ను 2021 సెప్టెంబరులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎస్ఐ) అధికారులు గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుకున్నారు. విజయవాడలోని సత్యనారాయణపురం గడియారం వారి వీధి, ఇంటి నంబర్ 23-11-16 చిరునామాతో రిజిస్టరైన ఆష్లీ ట్రేడింగ్ కంపెనీ పేరిట ఈ హెరాయిన్ దిగుమతవుతున్నట్లు డీఆర్ గుర్తించింది. కోనసీమ జిల్లా ద్వారంపూడికి చెందిన మాచవరం సుధాకర్ తన భార్య దుర్గా పూర్ణిమా వైశాలి పేరిట ఆమె పుట్టింటి చిరునామాతో ఆష్ ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేసినట్లు తేల్చింది. ఆ తర్వాత కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఎన్ఐఏ ఆ ఇంటిని సీజ్ చేసింది. విజయవాడలో సోదాలు నిర్వహించి, పలు దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. సత్యనారాయణపురం చిరునామాతోనే ఎగుమతి. దిగుమతులు కోడ్ లైసెన్సు తీసుకుని హెరాయిన్ దిగుమతికి వినియోగించినట్లు దర్యాప్తులో గుర్తించి అప్పట్లోనే సుధాకర్, వైశాలిని అరెస్టు చేసింది. వీరి ప్రమేయంపై మొదటి అభియోగపత్రంలోనే వివరించింది. తాజాగా దాఖలు చేసిన అభియోగపత్రంలో ఈ హెరాయిన్ దిగుమతి వెనుక లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఉన్నట్లు తేల్చింది.

సూత్రధారి హర్తాసింగ్‌..
దిల్లీకి చెందిన హర్తాసింగ్ తల్వార్ అలియాస్ కబీర్ తల్వార్ సూత్రధారి అని ఎన్ఐఏ అభియోగపత్రంలో పేర్కొంది. ఆయన తన ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు పేరిట ఢిల్లీలో క్లబ్బులు, రిటైల్ షోరూమ్లు, దిగుమతి సంస్థలు నడుపుతూ వాటి ముసుగులో మాదకద్రవ్యాలను దిగుమతి చేస్తున్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో అన్నీ ట్రేడింగ్ కంపెనీని, మాచవరం సుధాకర్‌ను కూడా వినియోగించినట్లు పేర్కొంది. ఈ నిధులన్నింటినీ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు సమకూరుస్తున్నట్లు వివరించింది.