
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మునిగిపోయేందుకు సిద్ధంగా ఉందని రేటింగ్స్ సంస్థ ఫిచ్ తాజాగా తేల్చిచెప్పింది. దేశ దీర్ఘకాల విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన డిఫాల్ట్ రేటింగ్స్(ఐడీఆర్)ను సీసీసీ ప్లస్ నుంచి సీసీసీ మైన్‌సకు తగ్గించింది. పాక్ నగదు విలువ మరింతగా దిగజారేందుకు ఇది సూచిక అని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ఆర్థిక వ్యవస్థ అట్టడుగుకి చేరిందని, విదేశీ మారక నిల్వలు తీవ్రస్థాయికి పడిపోయాయని ఫిచ్ ఈ సందర్భంగా పేర్కొంది. ‘‘ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటేనే సీసీసీ మైనస్ రేటింగ్స్‌ను కేటాయిస్తాం. విదేశీ చెల్లింపులకు సంబంధించి ఇబ్బందులు, కరెంటు ఖాతా లోటు వంటివి దేశ ఆర్థిక తిరోగమనాన్ని సూచిస్తున్నాయి. అయితే.. ఇటీవల పన్నుల పెంపులతో కొంతమేర కోలుకునే అవకాశం లేకపోలేదు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎ్‌ఫ)కు సంబంధించిన 9వ సమీక్షను పాక్ విజయవంతగా పూర్తి చేస్తుందని అంచనా వేస్తున్నాం’’ అని ఫిచ్ స్పష్టం చేసింది.





