
238views
కళాసుధ తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ‘మహా శివరాత్రి మహోత్సవం’ జరుగనుంది. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావుకు ‘గురుశ్రీ’ పురస్కారం, ‘స్వర్ణకిరీట’ ధారణ చేయనున్నట్లు అసోసియేషన్ వ్యవస్థాపకుడు కళాసుధ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. చెన్నైలోని టి.నగర్ విజయరాఘవ రోడ్డులో ఉన్న ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా)లో శనివరాం సాయంత్రం 4.30 నుంచి శివరాత్రి మహోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ‘గురుశ్రీ’ పురస్కారం ప్రదానం చేయనుండగా, ఆస్కా అధ్యక్షుడు డాక్టర్ కె.సుబ్బారెడ్డి ‘స్వర్ణ కిరీట’ ధారణ చేయనున్నారు.





