
RAJA CHARI
PHOTO DATE: 08-22-17
LOCATION: Bldg, 8, Studio
SUBJECT: Official portraits of new ASCAN class
PHOTOGRAPHER: BILL STAFFORD
344views
భారత సంతతికి చెందిన వ్యోమగామి రాజాచారికి అమెరికా వైమానిక దళ (యూఎస్ఏఎఫ్) బ్రిగేడియర్ జనరల్ హోదా లభించనుంది. ఈ మేరకు దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆయన్ను గురువారం నామినేట్ చేశారు. ఈ నామినేషన్‌ను సెనేట్ ఆమోదించాల్సి ఉందని అమెరికా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చారి ఇప్పటికే వైమానిక దళ కల్నల్ స్థాయిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో క్రూ-3 కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన చారి, ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం అమెరికాలోనే స్థిరపడ్డారు. నాసాకు, యూఎస్ఏఎఫ్లో పలు విభాగాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.




