News

‘లా’ పుస్తకాలు, వెచ్చని దుస్తులు ఇవ్వాలని కోరిన ఆఫ్తాబ్‌… కోర్టు ఏమందంటే?

359views

దిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులోని నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని సాకేత్ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈక్రమంలో నిందితుడు తాను చదువుకోవడానికి లా పుస్తకాలు, తీవ్ర చలి ఉన్నందున వెచ్చని దుస్తులు కావాలని కోర్టు జడ్జీని డిమాండ్ చేశారు. దీంతో నిందితుడు ఆఫ్తాబ్ కు వెచ్చని దుస్తులు అందించాలని సాకేత్ కోర్టు జడ్జి అధికారులను ఆదేశించారు. నిందితుడు ఆఫ్తాబ్ శ్రద్ధావాకర్ ను(Shraddha murder case) చంపి ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో ఉంచి అడవిలో పారవేశాడు. మృతదేహం భాగాలను పారవేయడానికి ప్రసిద్ధ క్రైమ్ షోల నుంచి సమాచారం సేకరించాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. తన ప్రియురాలి మృతదేహాన్ని ముక్కలు చేసే ముందు మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని కూడా తాను చదివినట్లు ఆఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు.