
హిందువులపై దాడుల పరంపర దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇటీవల అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో బజరంగ్ దళ్ కార్యకర్తను ఓ ముస్లిం కుర్రాడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. బజరంగ్ దళ్ శిక్షణ శిబిరానికి వెళ్లి అతను తిరిగి వస్తుండగా సెలీముద్దీన్ అనే కుర్రాడు కత్తితో పొడిచారు. మృతిచెందిన కార్యకర్త పేరు శంభు కోయిరిగా గుర్తించారు.
కరీంగంజ్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు..
ఈ దారుణ సంఘటన జనవరి 8వ తేదీ తెల్లవారుజామున చోటుచేసుకుంది. శంభు కోయిరి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా.. వెనుక వైపు నుంచి వచ్చిన ముస్లిం కుర్రాడు పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దీంతో భజరంగ్‌దళ్ కార్యకర్త కోయిరి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతను కరీంగంజ్ జిల్లాలోని పథర్‌కండి ప్రాంతం వద్ద ఉన్న లోవైర్‌పోవా గ్రామానికి చెందినవాడని చెబుతున్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య వార్త బయటకు రావడంతో వందలాది హిందువులు, ఇతర ప్రజలు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం హంతకుడు సెలీముద్దీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఘటనకు ఇవే కారణాలు..
కొన్ని రోజుల కిందట క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సందర్బంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. అయినా సెలీముద్దీన్ మాత్రం దాన్ని మనసులో పెట్టుకుని హత్యచేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో వారు విచారణ చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. భద్రతా బలగాలను పోలీసులు మోహరించింది.
కర్ణాటకలోనూ భజరంగ్ దళ్ కార్యకర్తపై దాడి..
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్తపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశారు. ఈ సంఘటన జనవరి 9వ తేదీన చోటుచేసుకుంది. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శివమొగ్గ జిల్లాలోని బీహెచ్ రోడ్డు బస్టాండ్ సమీపంలో భజరంగ్ దళ్ కార్యకర్త సునీల్‌ను సమీర్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో సునీల్, సమీర్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకోగా.. ఈ ఘటన కత్తితో దాడికి దారితీసింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. దీంతో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.





