News

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను పొట్టన పెట్టుకున్న మావోయిస్టులు

864views

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను మావోయిస్టులు చంపేశారు. చత్తీస్‌గడ్‌లోని దంతేవాడ జిల్లాలో బీజేపీ కాన్వాయ్‌పై  మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బీజేపీ ఎంఎల్‌ఏ భీమా మాండవి  దుర్మరణం చెందారు. వీరితో పాటు మరో అయిదుగురు భద్రతా సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు  కోల్పోయారు.  భద్రతా బలగాలు , మావోయిస్టుల మధ్య  కాల్పులు కొనసాగుతున్నట్టు  తెలుస్తోంది.  దంతెవాడలోని సకులనార్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది.

భీమా మాండవి దంతెవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే. బస్తర్ ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ దంతెవాడలో మాత్రమే గెలుపొందింది. ఈ అటాక్ లో జరిగిన పేలుడు ధాటికి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం ఎగరిపడింది. అక్కడికక్కడే మాండవి మరణించారు. మొదట కేవలం దాడి జరిగిందని మాత్రమే వార్తలు వచ్చాయి. అయితే కొద్ది సేపటికి ఆయనతో పాటూ మావోల దాడి ఘటనలో ఐదుగురు జవాన్లు కూడా చనిపోయారని ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థి తెలిపారు. ఏప్రిల్ 11న చత్తీస్‌గడ్‌లో పోలింగ్ జరగనుంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.