News

శబరిమల పుండుపై ప్రశ్నల కారం చల్లిన కేరళ పబ్లిక్ సర్వీస్ కమీషన్.

679views

కేరళ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఒక పరీక్ష కోసం ఇచ్చిన ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్న హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరచింది. సైకియాట్రీ ప్రశ్నపత్రంలో “శబరిమల దేవస్థానంలోనికి 10 నుంచి 50 సంవత్సరాల వయస్సు మహిళలను అనుమతిస్తూ సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మొదటిగా గుడిలోనికి అడుగుపెట్టిన మహిళ ఎవరు?” అనేది ప్రశ్న. జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఇచ్చిన ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు.

దీనిపై హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కేవలం హిందువుల మనసులను గాయపరచటానికి కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం చేసిన చౌకబారు చర్యగా వారు అభివర్ణిస్తున్నారు. శబరిమల సాంప్రదాయాలను, పవిత్రతను మంటగలపటానికి కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించిన హిందువులను అవమానించటానికే ప్రభుత్వం ఇలాంటి చేష్టలకు పాల్పడుతోందని హిందువులు చెబుతున్నారు.

2010వ సంవత్సరంలో ఒక ప్రశ్నపత్రంలో ‘మొహమ్మద్’ పేరును చేర్చిన పాపానికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన గూండాలు టి.జె.జోసెఫ్ అనే ప్రొఫెసర్ చేతిని నరికేసిన సంఘటనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

ప్రొఫెసర్ టి.జె. జోసెఫ్