
బుడేల్: చండీగఢ్‌లోని బుడేల్లో ఘోరం జరిగింది. 18 ఏళ్ళ యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోమని బాధితురాలిపై ఒత్తిడి చేశాడు. అందుకు బాధితురాలు నిరాకరించడం వల్ల.. ఆమె ఇంట్లోకి చొరబడి గొంతుకోసి చంపేశాడు. నిందితుడు బిహార్‌కు చెందిన మహ్మద్ షరీక్(25)గా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిందితుడిని సెక్టార్- 43 బస్టాండ్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు, నిందితుడు ఎదురెదురు ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మృతురాలి తల్లి పనిమనిషిగా పనిచేస్తోంది. యువతి తండ్రి.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంటున్నాడు. నవంబర్ 19న యువతి సోదరుడు ఇంటికి వచ్చే చూసేసరికి ఆమె మంచంపై అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాధితురాలు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలు ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. నిందితుడు ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా బాలికను తనతో శారీరక సంబంధం పెట్టుకోమని వేధించేవాడు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు.
Source: Nijamtoday





