News

ట్విటర్‌లో మస్క్‌ సలహాదారుగా భారతీయుడు

391views

న్యూఢిల్లీ: ట్విటర్‌ను చేజిక్కించుకున్న అనంతరం తొలగింపులు, బ్లూటిక్‌కు డబ్బులు తదితర నిర్ణయాలతో ఎలాన్‌ మస్క్‌ అడుగులు వేస్తున్నారు. ఈ రంగంలో అనుభవం లేని ఆయనకు భారతీయుడైన శ్రీరామ్‌ కృష్ణన్‌(16 కంపెనీ) సాయం చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన శ్రీరామ్‌.. అన్నా వర్సిటీలో చదివారు. మైక్రోసాఫ్ట్‌లో విజువల్‌ స్టూడియో ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత మెటా(ఫేస్‌బుక్‌) కోసం మొబైల్‌ యాడ్‌ ప్రొడక్ట్‌లను తయారు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి