News

భారతీయులతో కలిసి కమలా హ్యారిస్ దీపావళి సంబరాలు

328views

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నేవల్ అబ్సర్వేటరీలోని తన అధికారిక నివాసంలో దసరా వేడుకలు జరుపుకొన్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయ సంతతి వారు హాజరయ్యారు. అమెరికాలోని ప్రముఖ భారతీయులందరినీ కమలా హ్యారిస్ దంపతులకు ఆతిథ్యమిచ్చారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జో బిడెన్ సీనియర్ సలహాదారు నీరా టాండెన్, అమెరికన్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి, రిచ్ వర్మ, భారతదేశంలోని అమెరికా మాజీ రాయబారి రిచ్ వర్మ, ఆసియా అమెరికన్లపై ప్రెసిడెంట్ బిడెన్స్ అడ్వైజరీ కమిషన్ కమిషనర్ అజయ్ భూటోరియా లతో సహా పలువురు ప్రముఖ భారతీయ-అమెరికన్‌లు పాల్గొన్నారు.

కమలా హారిస్, సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసిన వీడియోలలో, తన భర్తతో కలిసి దీపాలను వెలిగిస్తూ, ఒకరికొకరు ఆనందిస్తూ, దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా అధికారులు కమలా నివాసాన్ని దీపాలు, వివిధ రకాల లైట్లతో గొప్పగా అలంకరించారు.

తన తల్లి చెన్నైలో జన్మించగా, డాక్టరేట్ చేసేందుకు అమెరికా వెళ్లి, అక్కడనే స్థిరపడిన భారత సంతతికి చెందిన కమలా హారిస్ మాట్లాడుతూ దీపావళి పండుగ గొప్పదనం విశ్వవ్యాప్తమైనదని ఆమె తెలిపారు.

‘‘అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యక్షురాలిగా నేను వీటి గురించి ఆలోచిస్తుంటా. అయితే.. చీకటి తరిమేసి వెలుగులను ఆహ్వానించే శక్తి మానవాళికి ఉందన్న దీపావళి లాంటి పండుగలు గుర్తు చేస్తుంటాయి’’ అని కమలా హ్యారిస్ తెలిపారు.

245 ఏళ్ల అమెరికా చరిత్రలో మొదటిసారిగా ఎన్నికైన దక్షిణాసియా మహిళ, దేశ ఉపాధ్యక్షురాలు హారిస్‌తో కలసి సంప్రదాయ దక్షిణాసియా పర్వదినాన్ని జరుపుకోవడం ఆనందంగా, గౌరవంగా ఉందని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖిజా సంతోషం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి