News

ఇమ్రాన్‌ ఖాన్‌పై ఐదేళ్ల అనర్హత వేటు

321views

ఇస్లామాబాద్‌: తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు చుక్కెదురైంది. ఆ కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌పై పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం అయిదేళ్ళ నిషేధాన్ని విధించింది. ఆర్టికల్‌ 63(1)(పి) ప్రకారం ఆ కేసులో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఈసీ తెలిపింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ తన డిక్లరేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేల్చారు. ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల ఇమ్రాన్‌ ఖాన్‌ జాతీయ అసెంబ్లీ నుంచి అనర్హత వేటుకు గురయ్యారు. అయిదేళ్ళ వరకు ఆయన పార్లమెంట్‌ ఎన్నికకు అనర్హుడు. అయిదేళ్ల నిషేధం పూర్తి అయ్యే వరకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 63 (1) (పి) ప్రకారం పార్లమెంట్‌కు కానీ, అసెంబ్లీకి కానీ ఇమ్రాన్‌ పోటీ చేయరాదు. ఒకవేళ ఎన్నికైనా, లేదా ఎంపికైనా .. దానికి అర్హత ఉండదు. చీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌ సికందర్‌ సుల్తాన్‌ రాజా నేతృత్వంలోని నలుగురు సభ్యులు బెంచ్‌ ఈ తీర్పును వెలువరించింది. ఏకగ్రీవంగా బెంచ్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి