
304views
అనపర్తి: ఏపీలోని అనపర్తి గ్రామం, పాత ఊరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని బైబిల్ ప్రతులను పంచారని ఆంధ్రజ్యోతిలో కథనం వెలువడింది. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయిని కొత్త నిబంధన పేరుతో ఉన్న బైబిల్ ప్రతులను పంచారని ఆ వార్తలో పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కడంతో విద్యార్థులకు పంపిణీ చేసిన బైబిల్ ప్రతులను వెనక్కి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.





