
బెంగళూరు: ‘వైద్యో నారాయణో హరి’ అన్న నానుడికి మచ్చతెచ్చేలా వ్యవహరించాడు ఓ డాక్టర్. చికిత్స పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. చికిత్స కోసం తన బామ్మతో కలిసి వచ్చిన 19ఏళ్ల బాలికను వేధించాడు బెంగళూరుకు చెందిన వైద్యుడు ఉబెదుల్లా. వృద్ధురాలిని బయటే ఉండమని చెప్పి.. యువతి చేతులు, శరీరభాగాలను తాకాడు. అంతేకాదు… యువతికి సెలైన్ పెట్టి.. బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీని గురించి ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించి ఇంటికి పంపించాడు. వైద్యుడికి భయపడి యువతి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే, తర్వాత ఆమెకు జ్వరం వచ్చింది. మళ్ళీ డాక్టర్ వద్దకు తీసుకెళ్తారన్న భయంతో జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేసింది. ఆగ్రహం చెందిన యువతి సోదరులు.. వైద్యుడి క్లినిక్‌ను ధ్వంసం చేశారు. వైద్యుడు ఉబెదుల్లా పారిపోయాడు. అతడిపై చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు.
Source: EtvBharat





