News

త్రివిధ దళాల సైనిక అవసరాలు తీరుస్తాం: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్

334views

న్యూఢిల్లీ: భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా.. విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు. త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో.. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇకపై భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా అనిల్‌ చౌహాన్ విధులు నిర్వర్తించనున్నారు.

సైన్యం, నౌక, నావిక దళాల అవసరాలను తీర్చేందుకు తాను కృషి చేస్తానని బాధ్యతలు చేపట్టిన అనంతరం అనిల్ చౌహాన్‌ అన్నారు. ఆయన అంతకుముందు జాతీయ యుద్ధస్మారకం వద్ద తన తండ్రి సురేంద్ర సింగ్ చౌహాన్​తో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో సైనికుల గౌరవవందనాన్ని స్వీకరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి