News

పిత్రోడా వ్యాఖ్యలతో చిక్కుల్లో కాంగ్రెస్.

689views

రాహుల్ గాంధీ ముఖ్య సలహాదారు సాం పిత్రోడాకు ప్రస్తుత భారత దేశ స్థితిగతులపై అవగాహన లేదా? అని కాంగ్రెస్ కార్యకర్తలతో సహా అందరూ ప్రశ్నిస్తున్నారు. యీన్నికల వేళ ఆయన వ్యక్తపరచిన ఉదారవాద భావనల వాళ్ళ పార్టీకి ఏమైనా లబ్ది చేకూరుతుందా? పిత్రోడా పుల్వామా ఘటన ఏ ఒక్కరి వల్లో, కేవలం 8 మంది వల్లో అయ్యేపని కాదని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఉగ్రవాదులపై వైమానిక దాడులకు పాల్పడడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. నిజానికి వైమానిక దాడి సాధారణ పాకిస్థాన్ పౌరుల మీదనో, పాక్ సైన్యం మీదనో జరిపినది కాదు. ఉగ్రవాదులపై, వారి స్థావరాలపై జరిపినది. మరి “పిత్రోడాకు ఉగ్రవాదులపై, శత్రు దేశం పాకిస్థాన్ పై అంత ప్రేమ ఎందుకో?” అని కొందరు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు.

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన కారణంగా అయినా పిత్రోడా తన మనసులోని అభిప్రాయాలను వ్యక్తపరచాకుండా వుంటే బాగుండేది.

ఏదేమైనా కాంగ్రెస్ యొక్క పాక్ అనుకూల వైఖరి ప్రజలలో కాంగ్రెస్ పై ఆగ్రహం కలిగిస్తోంది. ఎన్నికలలో కూడా ఈ అంశం కాంగ్రెస్ కు పెను నష్టం కలిగించక మానదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.