
434views
దుబాయ్: పాకిస్తాన్ స్టార్ పేసర్ హసన్ అలీ ‘ఐ లవ్ ఇండియా’ అని సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఒక పాకిస్తాన్ క్రికెటర్ నుంచి ఇలాంటి స్టేట్‌మెంట్ రావడం నిజంగా సంచలన విషయమే. టీమిండియాపై విమర్శలు గుప్పిస్తూ.. సవాళ్ళతో నోరు పారేసుకునే పాక్ క్రికెటర్లేనే ఇంతవరకు చూశాం. కానీ.. ఇండియాలో నాకు ఫ్యాన్స్ ఉన్నారు.. ఐ లవ్ ఇండియా అంటూ తొలి సారి హసన్ అలీ చెప్పడం గొప్ప విషయం. ప్రస్తుతం ఆసియా కప్‌లో ఇండియా-పాకిస్తాన్ జట్లు బిజీగా ఉన్నాయి. ఆదివారం(ఆగస్ట్ 28) దాయాదుల పోరు కూడా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించి.. ఆసియా కప్ వేటను ఘనంగా ప్రారంభించింది.





