
సక్షం అధ్వర్యంలో విజయవాడలో రక్త దాన కార్యక్రమం జరిగింది. తలసీమా (రక్త హీనత) తో బాధపడుతున్న చిన్నారుల సహాయార్ధం రక్తాన్ని సేకరించారు. రోటరీ క్లబ్, రెడ్ క్రాస్, సక్షం సంస్థల సంయుక్త అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేకమంది యువకులు, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొని రక్తదానం చేశారు.

ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సక్షం యొక్క ప్రాణదా ప్రాజెక్ట్ సంయోజక్ శ్రీ కిశోర్ మాట్లాడుతూ దేశానికి సేవ చెయ్యాలని సైన్యంలోకి వెళ్ళాలన్నా, పోలీసవ్వాలన్నా, ఇంకే ఇతర మార్గంలో దేశ సేవ చేద్దామన్నా కొన్ని పరిమితులు ఉంటాయని, రక్త దానం మాత్రం ఎంత మంది అయినా, ఎవరైనా చెయ్యవచ్చన్నారు.

కృష్ణా జిల్లా సక్షం అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర శాస్త్రి గారు మాట్లాడుతూ తలసీమియా వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు వైద్య సేవలు అందించే నిమిత్తం సక్షం ఈ ప్రాణదా ప్రాజెక్టును ప్రారంభించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సక్షం సంస్థ దేశ వ్యాప్తంగా వున్న తలసీమా బాధిత చిన్నారులకు వైద్య సాయం అందిస్తున్నదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కు చెందిన డాక్టర్ పుష్ప మరియు రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సిబ్బంది, స్థానిక సక్షం కార్యకర్తలు పాల్గొన్నారు.





