Articles

మనకు తెలియని మనవారి వ్యధలు 1 – “అమ్మ ఒడిలో అక్షరాభ్యాసం”

779views

మె తెచ్చిన సంచిలో ఏముంది ?………….

16 సంవత్సరాల మాలాదాస్ ని మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడిగితే లోపలికి పరిగెడుతూ వెళ్ళింది. ఒక సంచి తీసుకొచ్చింది. అదేంటా అని ఆలోచిస్తుంటే అందులో నుంచి ఆనందంగా రెండు వస్తువులు బయటికితీసింది.

అవి 1.పెన్ను 2.పేపరు. మాకర్ధం కాలేదు. అందరం ఆశ్చర్యంగా చూస్తుండగానే నవ్వుతూ చకచకా ఏదో రాసి చూపించింది. మాలాదాస్ కళ్ళు ఆనందంతో నిండి ఉన్నాయి.

ఆ పేపర్ లో 16 సం.ల మాలా తన పేరు వ్రాసి అప్పుడే చదువు నేర్చుకునే 6 ఏళ్ల పసిపాపలా మురిసిపోతోంది. అప్పుడు అర్ధమైంది మాకు……. వాళ్ళు కోరుకునేది ఏమిటో….

మాలాదాస్… పాకిస్తాన్ నుంచి ప్రాణాలరచేత పాట్టుకుని భారత్ కు పారిపోయి వచ్చిన ఒక హిందూ కుటుంబంలోని అమ్మాయి.

ఇక్కడకు వచ్చిన కొద్ది నెలల్లో మాలాదాస్ సాధించిన గొప్ప ఘనత. ఆమె 16 వ ఏట తన పేరును వ్రాయడమే. ఆమె చెప్పిన మాట “నేను ఇక్కడకు వచ్చినప్పుడు నాకు పూర్తిగా చదవులేదు. ఈనాడు నాకు నా పేరు వ్రాయటం వచ్చు” అన్నది మాలాదాస్.

ఆమెను మీరు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు అని అడిగినప్పుడు అమాయకంగా చూసింది. అర్ధమైంది తనకింకా అంకెలు రాలేదని.

ఎందుకోసం వచ్చారు అని అడిగితే ” పాకిస్థాన్ లో హిందువులపై తీవ్ర మతహింస,అణచివేత వీటి పట్ల ప్రభుత్వ ఉదాసీనత” ఎక్కువగా ఉండటం వల్ల తమని తాము రక్షించుకోవడానికి పాకిస్థాన్ సింధ్ ప్రాంతంలోని హైదరాబాద్ నగరం నుండి 2011 లో తమ చుట్టుపక్కల వారితో కలసి కుటుంబంతో సహా “అమ్మ లాంటి భారతదేశానికి” వచ్చామని చెప్పింది.

కొద్ది నెలల క్రితం భారతదేశానికి బ్రతుకుతెరువు కోసం పాకిస్థాన్ నుండి వలసవచ్చిన హిందువులతో ఢిల్లీలో BBC నిర్వహించిన ముఖాముఖిలో మాలాదాస్ అనే 16ఏళ్ల అమ్మాయి వెలుబుచ్చిన అనుభవము.
ఇది పాకిస్తాన్లోని మైనారిటీ హిందువుల పరిస్థితి.