
387views
-
1961 తర్వాత తొలిసారి తీవ్ర ఎండలు
-
నిలిచిన జల విద్యుదుత్పత్తి
బీజింగ్: అసలే కొవిడ్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన చైనాకు గోరుచుట్టుపై రోకటిపోటులా తీవ్ర అనావృష్టి వచ్చిపడింది. వరుణుడు ముఖం చాటేయడంతో వేసవి ఎండలు మండిపోతున్నాయి. చైనాలో వర్షపాతం గడచిన 60 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అతి తక్కువ స్థాయికి పడిపోయింది. ఆసియాలోని అతిపెద్ద నదుల్లో ఒకటైన యాంగ్జే సగానికి సగం చిక్కిపోయింది. అనావృష్టితో నదులు ఎండిపోవడం జలవిద్యుదుత్పత్తిని దారుణంగా దెబ్బతీసింది. కర్మాగారాలకు కరెంటు సరఫరా నిలిచిపోయి, పారిశ్రామికోత్పత్తి దెబ్బతింటోంది. మంచినీటికి, సాగునీటికి కటకట ఏర్పడింది. 2022లో 5.5% వృద్ధిరేటును సాధించాలనుకున్న డ్రాగన్.. ఈ ఏడాది ప్రథమార్ధంలో అందులో సగం రేటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Source: Eenadu





