News

బీహార్ అధికారిక కార్యక్రమాల్లో లాలూ అల్లుడు ప్ర‌త్య‌క్షం!: మండిప‌డ్డ బీజేపీ

359views

పాట్నా: బీహార్ ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో లాలూ అల్లుడు పాల్గొనడం కొత్తగా ఏర్పడిన కూటమిని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. లాలూ పెద్ద కుమారుడు, అటవీ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. ఏర్పాటు చేసిన మీటింగ్​లో ఆయన బావ పాల్గొనడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శిస్తున్నాయి.

ఈనెల 17న ఏర్పాటు చేసిన కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమావేశానికి మంత్రి తేజ్ ప్రతాప్ హాజరయ్యారు. ఆయనతో పాటు.. తన సోదరి మిసా భారతి భర్త శైలేశ్​ కుమార్ కూడా సమావేశానికి హాజరయ్యారు. కుమార్.. ఎంపీలు కూర్చునే సీట్లకు వెనుక వరుసలో కూర్చొని కనిపించారు. మరుసటి రోజు ఏర్పాటు చేసిన అదే సమావేశంలో శైలేశ్​ తన బావమరిది మంత్రి తేజ్ ప్రతాప్ పక్కనే కూర్చొని కనిపించారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి