News

బీజేపీ కార్యకర్తల తలలు పగలగొట్టిన తృణమూల్ ఎమ్మెల్యే

462views

కోల్‌క‌తా: బెంగాల్​లో బీజేపీ, టీఎంసీ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు పలుమార్లు బాహాబాహీకి దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. చి​సురాలో అలాంటి ఘటనే జరిగింది. ర్యాలీగా వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందార్. పార్టీ కార్యకర్తలతో కలిసి కర్రలతో బీజేపీ కార్యకర్తలను కొట్టారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వల్ల ఎమ్మెల్యే తీరును పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాసేపటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు.

శాంతియుతంగా చేస్తున్న ర్యాలీ బీజేపీ శ్రేణులపై ఎమ్మెల్యే అసిత్ మజుందార్, టీఎంసీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే మజుందార్ ఆదేశాలతో ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది. ఎమ్మెల్యే స్వయంగా పలువురు బీజేపీ కార్యకర్తల్ని కర్రలతో కొట్టడం దారుణం.” అని హుగ్లీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విమర్శించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి