News

క్రికెట్ లీగ్ పేరిట ర‌ష్య‌న్స్‌కు టోక‌రా!

427views

గుజరాత్‌: గుజరాత్‌లో ఉంటూ రష్యాలో ఉన్న వాళ్ళ‌కు ఏకంగా ఒక లీగ్ విషయం టోకరా వేశారు. అధికారిక టోర్నీ రేంజిలో బిల్డప్ ఇచ్చి మోసానికి పాల్ప‌డ్డారు. ఇక్క‌డి మెహసానా జిల్లాలోని ఒక గ్రామంలో ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన మూడు వారాల తర్వాత కొత్త లీగ్‌ను మొదలు పెట్టారు. అద్భుతమైన మరొక టి20 క్రికెట్ లీగ్ అని చెప్పి రష్యన్ జూదగాళ్ళ‌ను ఈ టోర్నీ వైపు మల్లేలా చేశాడు.

వ్యవసాయ కూలీలు క్రికెటర్లుగా నటించడం, క్రికెట్ గ్రౌండ్‌గా పొలాలను మార్చేశారు. వ్యాఖ్యానం కోసం హర్షా భోగ్లే లాంటి వాళ్ళ‌ను తీసుకుని వచ్చి రష్యన్లను బాగా మోసం చేశారు. బెట్టింగ్‌ కోసం ప్రత్యేకంగా టెలిగ్రామ్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. ఏకంగా దీనికి “ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్” అని పేరు పెట్టారు. నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల విచారణలో షూబ్ దావ్దా రష్యన్ పబ్‌లో పనిచేస్తున్నప్పుడు పరిచయమైన ఆసిఫ్ మహ్మద్ ఈ మోసానికి సూత్రధారిగా తేలింది. ఆసిఫ్ బెట్టింగ్ వేయించ‌డం మొదలుపెట్టాడు. మోలిపూర్‌లో షూబ్ దావ్దా.. సాకిబ్, సైఫీ, మహమ్మద్ కోలుతో కలిసి పనిచేశాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి