News

కర్ణాటకలో వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ దారుణ హ‌త్య‌!

428views

హుబ్బల్లి: కర్ణాటకలోని హుబ్బల్లి జిల్లాలోని ఓ ప్రముఖ హోటల్‌లో ‘సరల్ వాస్తు’ ఫేమ్ చంద్రశేఖర్ గురూజీని ఇద్ద‌రు దుండ‌గులు మంగళవారం ఉదయం కత్తితో పొడిచి, దారుణంగా హ‌త్య చేశారు. గురూజీ వ్యాపార నిమిత్తం ఎవరినైనా కలిసేందుకు నగరంలోని ప్రెసిడెంట్ హోటల్‌కు వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

హోటల్ రిసెప్షన్ వద్ద ఇద్దరు వ్యక్తులు అతడిని కత్తితో పొడిచిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి. ఈ హింసాత్మక ఘటనతో భయాందోళనకు గురైన చుట్టుపక్కల వారు అక్కడి నుంచి పరుగులు తీశారు.

పరారీలో ఉన్న హంతకుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న హుబ్బళ్లి పోలీస్‌ కమిషనర్‌ లాభూరామ్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మొబైల్ టవర్ ఆధారంగా కొంత సమాచారం అందిందని, విచారణ తర్వాత అసలు విషయం తెలుస్తుందని, కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తున్నామని లాభూరాం తెలిపారు. హత్యను సీఎం బొమ్మై ఖండించారు.

Source: Organiser, IndiaToday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి