News

మరో జాతీయ రికార్డును బద్దలు కొట్టిన నీరజ్

356views

న్యూఢిల్లీ: ఒలింపిక్‌ జావెలిన్‌ త్రో స్వర్ణ విజేత నీరజ్‌ చోప్డా అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రతి ఈవెంట్‌కు మెరుగువుతున్న అతడు స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌లోనూ మెరిశాడు. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 89.94 మీటర్లు త్రో చేసి రజతం సాధించాడు. డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌కు ఇదే తొలి పతకం. 24 ఏళ్ల నీరజ్‌ ఇటీవల పావో నుర్మి క్రీడల్లో 89.30మీ త్రోతో జాతీయ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డైమండ్‌ లీగ్‌లో అతడు తన తొలి ప్రయత్నంలోనే 89.94 మీటర్ల త్రో చేశాడు. ఆ తర్వాత వరుసగా 84.37మీ, 87.46మీ, 84.77మీ, 86.67మీ, 86.84మీ త్రోలు చేశాడు. స్వర్ణ విజేత పీటర్స్‌ అండర్సన్‌ (గ్రెనెడా) తన మూడో ప్రయత్నంలో 90.31 మీటర్ల త్రో చేసే వరకు నీరజ్‌దే అత్యుత్తమ ప్రదర్శన. జర్మనీ ఆటగాడు వెబ్బర్‌ (89.08మీ) కాంస్యం గెలుచుకున్నాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి