News

ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై ఫిర్యాదు

801views

భాగ్య‌న‌గ‌రం: రామ్ గోపాల్ వర్మ ద్రౌపది ముర్ముపై కూడా ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు ఏకంగా కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రౌపది ముర్మును ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్‌పై బీజేపీ నాయకులు ఫైర్‌ అయ్యారు. అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్‌ పోలీసులను కోరారు.

ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన సందర్భంగా ‘ద్రౌపది రాష్ట్రపతి ‘ అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరంటూ కామెంట్ చేశారని, ఇవి ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ (SC), ఎస్టీ (ST) అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి